Telangana university M.Com Deportment.

TSPSC చైర్మన్ గా ఘంటా…సభ్యులగా ముగ్గురురాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ కొత్త పాలకవర్గం కొలువు దీరబోతోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత.. TSPSCపై కాన్సంట్రేట్ చేశారు సీఎం కేసీఆర్. ముందునుంచి అనుకున్నట్లుగానే…ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి చైర్మన్ పదవి కట్టబెట్టారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ.. పాలకవర్గాన్ని నియమించారు. చైర్మన్ గా ఘంటా… ఇన్నాళ్లూ నిరుద్యోగులు ఎదురు చూసిన TSPSC కి కార్యవర్గం ఏర్పాటైంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని నియమించారు సీఎం కేసీఆర్. సభ్యులుగా జేఏసీ నేత సి.విఠల్, ప్రభుత్వ ఉద్యోగి మతీనుద్దీన్, మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతిలకు అవకాశమిచ్చారు. సీఎం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ నరసింహన్ ఓకే చెప్పటంతో.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఐదుగురి పేర్లు రిజెక్ట్… కేసీఆర్ ప్రతిపాదించిన మరో ఐదుగురు సభ్యుల పేర్లను గవర్నర్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూల్స్ ప్రకారం.. కమిటీ మెంబర్స్ లో సగం మంది ప్రభుత్వ ఉద్యోగులై ఉండాలి. ఇరవైఏళ్ల సర్వీస్ కంప్లీట్ చేసి ఉండాలి. కేసీఆర్ సూచించిన మరో ఐదుగురిలో ఇద్దరు ప్రొఫెసర్లు, ముగ్గురు న్యాయవాదులున్నారు. ప్రొఫెసర్లు గవర్నమెంట్ ఎంప్లాయిలు కాకపోవటం.. ఇద్దరు అడ్వకేట్లపై క్రిమినల్ కేసులు ఉండటంతో తిరస్కరించినట్లు సమాచారం. జర్నలిస్ట్ నుంచి… ఛైర్మన్ గా నియమితులైన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిది.. కరీంనగర్ జిల్లా. ఓయూ నుంచి పీహెచ్ డీ పట్టా పొందారు. తెలుగు దినపత్రికల్లో జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో కొంతకాలం న్యూస్ రీడర్ పనిచేశారు. గతంలో కాకతీయ యూనివర్శిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ గా పనిచేసిన చక్రపాణి.. 20 ఏళ్లుగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు. పొలిటికల్ ఎనలిస్ట్ గా గుర్తింపు పొందారు. ఉద్యమంలో తనవంతు కృషిచేశారు. కమిటీ సభ్యుల్లో ఒకరైన సి.విఠల్ ది రంగారెడ్డి జిల్లా. ప్రస్తుతం ఇంటర్ బోర్డులో పనిచేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కేసీఆర్ కు దగ్గరి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. గిరిజన కోటా నుంచి వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతిని నియమించారు. ఎంబీబీఎస్ చదివిన చంద్రావతి టీఆర్ఎస్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. మరో సభ్యులు మతీనుద్దీన్ ఖాద్రి.. విద్యావేత్తగా మైనార్టీ వర్గాల్లో గుర్తింపు పొందారు. ఆరేళ్లపాటు పదవిలో… ఛైర్మన్ తో పాటు సభ్యులు ఆరేళ్లపాటు పదవిలో కంటిన్యూ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం చైర్మన్ చక్రపాణితో పాటు.. సభ్యులు బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. మొదటి నుంచి సామాజిక సమీకరణాలు.. ఉద్యమ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళుతోన్న కేసీఆర్.. TSPSC పాలక మండలి విషయంలోనూ అదే ఫార్ములా ఫాలో అయినట్లు కనిపిస్తోంది.