ఐలోని మల్లన్న - AINAVOLU MALLANNA

వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలంలోని అయినవోలు గ్రామంలో చాళుక్యుల కాలంలో నిర్మించబడ్డ పురాతన దేవాలయం ఉన్నది.ఆరడుగుల ఎత్తుతో,నాలుగు చేతుల్లో...త్రిశూలం,ఢమరుక,పానపాత్ర,ఖడ్గం ధరించిన భీకర మూర్తిని మల్లన్న అని పిలుస్తారు.ఇతనికే ఖండేల్ రాయుడు,మైలార దేవుడు అనే పేర్లు కూడా ఉన్నవి.ఈ మైలార సాంప్రదాయం మన ప్రాంతంలోనే కాకుండా,మహారాష్ట్రలో పుణే నగరానికి దగ్గరలో ఉన్న జెజూరి గ్రామంలోని చిన్న కొండపైన ఖండోబా ఆలయం ఉన్నది. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఈ మైలార పూజ విశేష ప్రాచుర్యం పొందింది.