Mega Power Star RamCharan

చరణ్ కి తల్లి గా జీవిత…! మెగాస్టార్ చిరు ఫ్యామిలీకి రాజశేఖర్, జీవిత దంపతులకు మధ్య ఉన్న విబేధాలు అందరికి తెలిసిందే. చిరు ప్రజారాజ్యం స్థాపించినప్పుడు జీవిత, రాజశేఖర్ వర్సెర్ చిరు మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరిగింది. ఆ టైంలో చిరు ఫ్యాన్స్ జీవిత, రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారుపై రాళ్లతో కూడా దాడి చేశారు. తర్వాత చిరు వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించడంతో పాటు వారికి సంఘీభావం తెలిపి.. ఆ సంఘటనను ఖండించారు. తాజా సమాచారం ఏంటంటే రాంచరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా(వర్కింగ్ టైటిల్ మై నేమ్ ఈజ్ రాజు)లో ఛెర్రీ తల్లి క్యారెక్టర్‌ను జీవిత పోషిస్తున్నట్టు సమాచారం. ఈ పాత్ర కోసం తొలుత నదియా, రమ్యకృష్ణ, మధుబాల పేర్లు వినిపించాయి. చివరకు ఈ అవకాశం జీవితకు దక్కినట్టు తెలుస్తోంది. జీవిత-రాజశేఖర్ దంపతులకు చిరు ఫ్యామిలీకి మధ్య చిరు సోదరుడు నాగబాబు సయోధ్య కుదిర్చినట్టు తెలుస్తోంది. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతోంది. మొత్తానికి ఛెర్రీ సినిమాలో జీవిత నటిస్తుండడంతో ఈ రెండు ఫ్యామిలీల మధ్య చాలా కాలంగా ఉన్న విబేధాలకు తెరపడినట్లయ్యింది.