Telugu Christian Song Lyrics and Messages

ఒకరి నొకరు కీర్తనలతోను సంగీతంతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు,హృదయంలో పాడుచు కీర్తించండి, గానం అనేది ఓ ఉజ్జీవం లాంటిది, దేవుడు క్రైస్తవ సంగీతము యొక్క స్థానమూ, పాటను పాడేది పెదవులే అయిన పాటకు ప్రాప్తిస్తానం హృదయమే "దేవుని సంఘం పాటలు పాడి లోకమును జయించెను" అను మాట ముమ్మాటికీ నిజము యుగయుగముల తరబడి, దేశ దేశాలలో, వందలాది మానవ భాషలలో ఉత్పన్నమైన క్రైస్తవ సంగీతం, సాహిత్యం నిరూపమానమైనది.

సంగీతం ఒక విశ్వ భాష-సువార్త సంగీతం ఓ స్వర్లోక భాష, దేవుని పట్ల తన్మయత్వంతో సంఘారాధనలో పాడే ప్రతి పాట ఒక సజీవ గీతం.

ప్రభువునందు విశ్వసించిన ప్రియులకు, నిరాశ, నిస్పృహలో, నిరీక్షణలో యున్నవారికి ప్రోత్సాహంగా యుండవలెనని ఆశిస్తున్నాను. దేవుడు సదాకాలం తోడైయుండునుగాక!