తెలుగు వీర లేవరా

తెలుగు జాతి అఖిలావనికే జ్యోతి అని వొకప్పుడు అందరూ కీర్తించారు ,కాని అదే తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా విడిపోయింది ,అది కూడా అభివృద్ధి కోసమే ,ప్రతి చెడుకు వొక మంచి ఉంటుంది ఇది ఇద్దరు తెలుగువారికి మంచిదే ,వొకరిది వొకరు తిన్నారు ,దోచారు అనే మాటలకు ఇక కాలం చెల్లింది ,ఆంధ్రాలో ఎన్నో కోట్ల ఎర్రచందనం నిల్వలప్యే ద్రుస్టి పెట్టారు ,కలిసివున్నపుడు వాటి విషయం గాలికి వదిలేశారు ,అలాగే తెలంగాణాలో హైదరాబాద్ ,వరంగల్ ,నిజామాబాదు లాంటి కొన్ని పట్టణాలు మాత్రమే అభివృద్ధి చెందాయి ,అయతే సమిష్టి కృషితో హైదరాబాద్ ముందంజలో ఉంది ,ఇక్కడ ఎవరి సొమ్ము ఎవరు తిన్నదీ లేదు ,ఎవరి కష్టం వాళ్ళది ,నోరు జారి మాట్లాడితే నలుగురిలో నవ్వులపాలు అవ్వడం తప్ప వొరిగెదెమ్ లేదు ,మంచి స్వభావం ,ప్రతిభ ఉన్న తెలుగు వీరులకు ఇదే ఆహ్వానం ,మీ వీరోచితం అభివృద్ధి కోసమే ఉండాలి కాని దూషణలకు ఆస్కారం లేదు ,ప్రాంతాలతో సంబంధం లేదు ,ఎవరు బాధపడ్డా సహించేది లేదు ,ప్రతి తెలుగువారికి ఈ గ్రూప్ అంకితం