UBALANKA-533237

అమర్‌నాథ్‌ యాత్ర - Amarnadh Yatra :
http://www.templeinformation.in/…/amarnadh-yatra-informatio…
యాత్రీకులు చేయవలసినవి * యాత్రను నమోదు చేసుకునే సమయంలో వైద్యపరిశీలన నిర్వహించి సముద్రమట్ట్శానికి 14,000 అడుగుల ఎత్తులో కొండచెరియలను ఎక్కేసమయంలో శరీరం తట్టుకోగలదా శోధిస్తారు. వైద్యుల ద్రువీకరణ పత్రాలను యాత్రీకులు వెంట తీసుకుని వెళ్ళాలి. అలాగే రోజుకు 4-5 కిలోమీటర్లు నడక వ్యాయామం మరియు ప్రాణాయామం వంటి వ్యాయామం కనీసం ఒక మాసానాకి ముందు ఆరంభించి శరీరాన్ని యాత్రకు సిద్ధం చేసుకోవాలి. * యాత్రీకులు "ఎస్ ఏ ఏ బి" వద్ద నమోదు చేసుకోవడం తప్పనిసరి. * ఎత్తైన పర్వతసానువులలో చలిగాలుల మధ్య ప్రయాణం చేయాలి కనుక యాత్రీకులు ఉన్ని దుస్తులు, చిన్న గొడుగు, విండ్ చీటర్, రైన్ కోటు, స్లీపింగ్ బ్యాగ్, వాటర్ ప్రూఫ్ షూలు, టార్చి, చేతి కర్ర, మంకీ క్యాప్, గ్లోవ్స్, జాకెట్, ఉలెన్ సాక్స్ మరియు ట్రౌజర్లు తమ వెంట తీసుకు వెళ్ళాలి. * స్త్రీలకు చీరెలు యాత్రకు అనుకూలం కావు కనుక చుడిదార్, ప్యాంట్ షర్ట్ లేక ట్రాక్ సూట్ తీసుకు వెళ్ళడం మంచిది. * కఠినమైన కొండ మార్గం మీద జాగ్రత్తతో నడక సాగించాలి. * పోనీ వాలా, కూలీలు, దండివాలాలు నమోదు చేసుకున్న వారా అని జాగ్రత్తగా పరిశీలించండి. నమోదు చేసుకున్న వారు బాల్ తల్, పాంచ్ తర్ణి, పహల్ గాం వద్ద లభిస్తారు. * పోనీ వాలాలు, కూలీలు మీ వెంట వస్తున్నారా అని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. వారు మీ నుండి తప్పి పోయినట్లైతే అత్యవసరమైన సమయాలలో మీకు కావలసిన వస్తువులు మీకు లభ్యం కావడం కష్టం కనుక సమస్యకు ఎదుర్కోవలసి ఉంటుంది కనుక జాగ్రత్త వహించండి. * యాత్రీకులు బాల్ తల్ , పహల్ గాం నుండి బయలుదేరే సమయంలో మీ దుస్తులు మరియు ఆహారపదార్ధాలను వాటర్ ప్రూఫ్ బ్యాగులలో బధ్రపచి అవి తడిసి పోకుండా కాపాడుకోండి. * యాత్రీకులు తమకు కావలసిన సామానులు వసతి గృహాలకు అవసరమిన ధనాన్ని దగ్గర ఉంచుకోవాలి. * మీ గురించిన సకల వివరాలను వ్రాసుకున్న ఐడెండిటీ సమాచారాన్ని మీ వద్ద ఉంచుకోడి. అయవసర సమయాలలో అది ఉపకరిస్తుంది. * మీరు రోజూ తీసుకోవలసిన మందులను సాదారణ కావలసిన మందులను వెంట తీసుకు వెళ్ళండి. * ప్రయ్ణం చేసే సమయంలో వేగించిన పప్పులు, టాఫీలు, చాక్ లెట్స్ మొదలైనవి మీ వెంట మోసుకు వెళ్ళండి. * కోల్డ్ క్రీం, మరియు వ్యాజ్ లిన్, స్పష్టంగా చూడడానికి కావలసిన కళ్ళద్దాలు వెంట తీసుకు వెళ్ళండి. అవి తడి, పొడి వాతావరణంలో చర్మాన్ని కాపాడుకోవడానికి ఉపకరిస్తుంది. * కొండ ఎక్కుతూ మధ్యలో విశ్రాంతి తీసుకునే సమయంలో మీకు మీమీరే స్వతంత్రించి మీ శక్తికి మించి దూరంగా వెళ్ళ కండి. * నిదానమైన స్థిరమైన నడకతో యాత్రను సాగించండి. వేగమైన నడక వలన త్వరగా అలసి పోతారు. * మీ తోటి యాత్రీకులకు కావలసిన సాయం చేస్తూ ప్రశాంతంగా యాత్రను సాగించండి. * నిర్వాహకుల సలహాలను శ్రద్ధగా పాటించండి. * నీరు, గాలి, వాయువు, భూమి, ఆకాశం ఈశ్వరుడి స్వరూపం కనుక పరిసరాలను కలుషితం చేయకుండా యాత్రను సాగించండి. ఫ్లాశ్టిక్ సామానులు పూర్తిగా నిషిద్ధమని గ్రహించండి. * మలమూత్ర విసర్జనకు " శ్రీఅమర్నాథ్ ష్రైన్ బోర్డ్ " ఏర్పాటు చేసిన బాత్ రూములను ఉపయోగించండి. బహిరంగప్రదేశాలలో చేయకండి.